Maharashtra Mandir-Nyas Parishad’s second annual house in Ozar

భారత్ న్యూస్ హైదరాబాద్,

పూణే జిల్లా, ఒజార్లో ‘మహారాష్ట్ర మందిర్-న్యాస్ పరిషత్’ రెండవ వార్షిక సభ

చత్రపతి శివాజీ మహారాజ్ కోరిక మేరకు కాశీ, మధుర మందిరాల విముక్తి కోసం అంకురార్పణం – సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ విష్ణు శంకర్ జైన్

ఒజార్ (పూణే జిల్లా) – ‘విగ్రహాలను బద్దలు కొట్టి దేవుళ్లను నిర్మూలించలేరు. వారు అదే ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉంటారు. అందుచేత ఒకసారి నిర్మింపబడ్డ మందిరం ఎప్పటికీ మందిరంగానే ఉంటుంది. కాశీ విశ్వేశ్వర మందిరాన్ని కూలగొట్టి అపవిత్రం చేశారు. ఆ పవిత్ర స్థలంలోని శిథిలాల మధ్య నమాజ్ చేస్తున్నారు. శ్రీ శృంగార దేవి మందిర ద్వారాలు మూసివేశారు. ఈ మందిరంలోని ప్రార్థనలు జరపడానికి హిందువులకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంది. ఇది హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం కోసం జరిగిన కుట్ర. దీనికి వ్యతిరేకంగా న్యాయపోరాటం జరుగుతోంది.

ఇక్కడ జరిగే ‘వజూ-అడ’ క్రతువును 2022 మే 16 వ తారీకున నిషేధించారు. పురావస్తు శాఖ వారి పరిశీలనల నివేదిక 2023 డిసెంబర్ 11న కోర్టు లో సమర్పించవలసి ఉంది. కాశీ విశ్వనాథ్ మందిరంలో ఉన్న అష్ట మండపం వద్ద హిందువులు పూజలు చేసే సమయం దగ్గర పడింది. చత్రపతి శివాజీ మహారాజ్ కాశీ మరియు మధురలకు విముక్తి కలగాలని కోరుకున్నారు. ఆయన కోరి కోరుకున్న విధంగా కాశీ మరియు మధుర లకు విముక్తి కలిగి సనాతన ధర్మానికి అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది.’ అని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ విష్ణు శంకర్ జైన్ అన్నారు. వీరు కాశీలోని జ్ఞానవాపి కోసం పోరాటం చేస్తున్నారు. పూణే జిల్లా, ఒజార్లో ‘మహారాష్ట్ర మందిర్-న్యాస్ పరిషత్’ రెండవ వార్షిక సభలో ‘జ్ఞాన్వాపి, కాశి, మధుర: న్యాయపోరాటం మరియు గెలుపు’ శీర్షికన ఆయన ఉపన్యసించారు.

న్యాయవాది సందీప్ జైగుడే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నగర్ జిల్లా నివాసాలోని ప్రాచీన శ్రీ నారద ముని దేవాలయం పరిధిలో మసీదు కట్టి దేవాలయాన్ని ఆక్రమించుకోవాలని ముస్లిం సమాజం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు వక్ఫ్ ఈ దేవాలయం మొత్తం తమదే అని అంటుంది. ఆధారాలను చూపించి హైకోర్టులో దీనిపై స్టే తేవడం జరిగింది.’ అని అన్నారు.
.
సనాతన సంస్థ యొక్క ప్రతినిధి శ్రీ చేతన్ రాజహంస్ మాట్లాడుతూ, “కొంతమంది సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని, అది ఒక వ్యాధి వంటిదని, కావాలనే ప్రకటనలు చేస్తున్నారు. ఈరోజు ధర్మాన్ని నాశనం చేయాలన్న వారు, రేపు దేవాలయాలను మూసివేయాలంటారు. అంచేత ఇటువంటి వారిపై న్యాయపోరాటం చేయడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గాను పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలి. సనాతన ధర్మ రక్షణకు అడుగు ముందుకేయాలి.’ అని అన్నారు.

హిందూ జనజాగృతి సమితి యొక్క జాతీయ ప్రతినిధి శ్రీ రమేష్ షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘జాతి వ్యతిరేక హలాల్ జిహాద్ కుట్రను ఎదురుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ స్వతంత్రంగా ముందుకు వచ్చి నియంత్రణ చర్యలు చేపట్టడం ముదావహం. హలాల్ ముద్రలకు కొనుగోలు కోసం ఇజ్రాయిల్ కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. కానీ తర్వాత హమాస్ దాడులకు ప్రతిదాడి చేయడంతో, ఇస్లామిక్ సంస్థలు ఇజ్రాయిల్ ఉత్పత్తులను నిషేధించడం మొదలెట్టాయి. అమెరికాలోని దేవాలయాలలో కూడా హలాల్ జిహాద్ పై అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనదేశంలోని దేవాలయాల్లో కూడా ఇటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.’ అని అన్నారు.

ఓజార్ లోని శ్రీ విఘ్నహార్ గణపతి దేవాలయం తరపున న్యాయవాది శ్రీ విష్ణు శంకర్ జైన్ గారికి శాలువా కప్పి, శ్రీ విఘ్నహార్ గణపతి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. శ్రీ గణేష్ కవాడే (శ్రీ విఘ్నహార్ గణపతి దేవాలయ ట్రస్ట్ అధ్యక్షులు), శ్రీ ఆనందరావు మండే (ట్రస్టీ), శ్రీ సురేష్ కౌడారే (భీమ్ శంకర్ దేవస్థానం అధ్యక్షులు) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లెన్యాద్రి దేవస్థానం అధ్యక్షులు శ్రీ జితేంద్ర బిడ్వే కూడా న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గారిని సత్కరించారు.

శ్రీ విఘ్నహార్ గణపతి దేవాలయం ట్రస్ట్ వెబ్సైట్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా, శ్రీ విఘ్నహార్ కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్, శ్రీ సత్యశీల్ శేర్కర్, న్యాయవాది శ్రీ విష్ణు శంకర్ జైన్, లెన్యాద్రి దేవస్థానం అధ్యక్షులు శ్రీ జితేంద్ర బిడ్వే, శ్రీ గణేష్ కవాడే (శ్రీ విఘ్నహార్ గణపతి దేవాలయ ట్రస్ట్ అధ్యక్షులు), సనాతన సంస్థ యొక్క ధర్మప్రచారకులు సద్గురు నందకుమార్ జాదవ్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో శ్రీ విఘ్నహార్ గణపతి దేవాలయం ట్రస్ట్ వెబ్సైట్ https://shreevighnaharganpatiozar.com ఆవిష్కరణ జరిగింది.

ఇట్లు,
మీ విధేయుడు,
శ్రీ.చేతన్ గాడి, రాష్ట్ర ప్రతినిధి,
హిందూ జనజాగృతి సమితి, 9951022282