Heavy rains in the North and Daksha Telangana district under the

భారత్ న్యూస్ హైదరాబాద్,

బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ మిగ్-జాం ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

*భద్రార్డీ కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబ్ బాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్.

*నేడు, రేపు రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం.

*భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి.

*భద్రార్డీ కొత్తగూడెం, ములుగు జిల్లాలలు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నాం.

*ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి.

*నీటిపారుదల శాఖ, విప్పటూల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్, రెవిన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలి.

*ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలి

*అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలి.