Maharishi Adhyatma’s research on university yagnas in a conference held in New Delhi

మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయ యజ్ఞాలపై జరిపిన పరిశోధనను న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో సమర్పించింది.

యజ్ఞ ప్రయోజనాన్ని పొందడానికి ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన జీవనశైలిని గడపడం మరియు ఆధ్యాత్మిక సాధన చేయడం చాలా అవసరం! – సీన్ క్లార్క్, MAV

‘వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి 418 పీపీఎంకు మించిపోయిందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రపంచంలో పెరుగుతున్న ఆధ్యాత్మిక కాలుష్యం (రజోగుణం మరియు తమోగుణాల పెరుగుదల) మరింత భయంకరమైనది. యజ్ఞాలు రజ, తమో గుణాల స్థాయిని తగ్గిస్తాయని శాస్త్రీయ ప్రయోగాలు చూపించాయి. అలాగే, యజ్ఞ ఫలితాన్ని సంపూర్ణంగా పొందడానికి, సమాజం సాత్విక లేదా ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన జీవనశైలిని గడపడం మరియు ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రకారం ఆధ్యాత్మిక సాధన చేయడం చాలా ముఖ్యం’ అని మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయ (MAV) తరపున శ్రీ సీన్ క్లార్క్ పేర్కొన్నారు. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన ‘వేద సంప్రదాయంలో మానవుడు మరియు ప్రకృతి: ఆధునిక దృక్పథం’ శీర్షికన జరిగిన WAVES యొక్క 27వ భారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘పర్యావరణాన్ని ఆధ్యాత్మికంగా శుద్ధి చేయడంలో యజ్ఞ శక్తి’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. పరాత్పర గురు (డా) ఆఠవలె ఈ పరిశోధనా పత్ర రచయిత మరియు శ్రీ క్లార్క్ సహ రచయిత.

అక్టోబర్ 2016 నుండి నవంబర్ 2023 వరకు MAV 110 సెమినార్‌లలో శాస్త్ర పరిశోధనా పత్రాలను సమర్పించింది, వాటిలో 18 జాతీయ సెమినార్‌లు; 92 అంతర్జాతీయ సెమినార్‌లు. 14 పరిశోధనా పత్రాలకు అంతర్జాతీయంగా ఉత్తమ ప్రదర్శన పత్రాల అవార్డు పొందాయి.

2022 జనవరిలో ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రం మరియు ఆశ్రమం మట్టి, నీరు మరియు గాలి నమూనాలను తీసుకుని వాటిపై ఏర్పడే యజ్ఞ ప్రభావాన్ని తెలుసుకోవడానికి 6 యజ్ఞాలను నిర్వహించింది. ఈ పరిశోధనా ఫలితాలను శ్రీ క్లార్క్ సమర్పించారు. ముందుగా కొంత మంది సాధకుల ఇళ్ళను, వారి ఇరుగుపొరుగులో ఉండే సాధకులు కానివారి ఇళ్ళను కొన్నిటిని ఎంపిక చేశారు. వీరి ఇళ్ళనుండి నేల, నీరు మరియు గాలి నమూనాలు యజ్ఞ నిర్వహణకు ముందు మరియు తరువాత కూడా తీసుకున్నారు. మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మన్నెం మూర్తి అభివృద్ధి చేసిన శాస్త్రీయ పరికరం యూనివర్సల్ ఆరా స్కానర్ (UAS)ని ఉపయోగించి మూడు రకాల నమూనాలను సానుకూల మరియు ప్రతికూల శక్తి కోసం పరీక్షించారు. యజ్ఞాలను అనుసరించి, రెండు రకాల (సాధకులు, ఇతరులు) ఇళ్లలోని మొత్తం 3 నమూనాలలో ప్రతికూల శక్తి తగ్గిందని మరియు సానుకూల శక్తి పెరిగినట్లు కనుగొనబడింది. ఈ ప్రభావం సాధకుల ఇళ్ళలోని నమూనాలలో మరింత ఎక్కువగా ఉంది, ఎందుకంటే సాధకుల ఆధ్యాత్మిక సాధన వల్ల ఇంట్లో ప్రతికూలత తగ్గుతుంది. అలాగే సానుకూలత మరియు బాహ్య సానుకూలతను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.

మిస్టర్ క్లార్క్ తన వివరణ కొనసాగిస్తూ,‘యజ్ఞయాగాదుల యొక్క సానుకూల ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో కూడా కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి యజ్ఞయాగాలకు ముందు మరియు తరువాత సేకరించిన నమూనాల అధ్యయనం నుండి ఇది కనిపించింది. యజ్ఞం ముగిసిన తర్వాత కూడా యజ్ఞం యొక్క ప్రభావం కొనసాగుతుందని ప్రయోగాలు చూపించాయి.’ అని అన్నారు.

భవదీయుడు
శ్రీ ఆశిష్ సావంత్
పరిశోధనా విభాగం
మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయం
(ఫోన్ సంఖ్య: 9561574972)