చైతన్య సేద్యం రైతుల మాసపత్రిక సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,

భారత్ న్యూస్ హైదరాబాద్….

చైతన్య సేద్యం రైతుల మాసపత్రిక సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు.

హైదరాబాదులోని జవహర్ నగర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. అనంతరం జూలకంటి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూ చైతన్య సేద్యం వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నదని ప్రశంసించారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చైతన్య సేద్యం మాస పత్రికను వెలువరిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ప్రతి సీజన్‌లో రైతులకు అవసరమైన, సాంకేతిక సమాచరాన్ని, మార్కెట్‌లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు అందించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితమే రైతు ఆత్మహత్యలని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. లక్షల ఎకరాల భూముల్ని కార్పొరేట్లకు దోచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో చైతన్య సేద్యం ఎడిటర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, నాయకులు టి. కిషోర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.