అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 11 విజయవంతం చేయాలి

భారత్ న్యూస్ హైదరాబాద్,

అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 11 విజయవంతం చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

ఖమ్మం:- అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పిలుపునిచ్చారు.
బుధవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11 న వలస పాలన కు , భూస్వామ్య పీడనకు, కంపెనీ వ్యవసాయ కు వడ్డీ వ్యాపారుల దోపిడీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన రైతుల పోరాటం సంఘటిత పర్చే క్రమం లో ఉత్తర ప్రదేశ్ లక్నో వేదికగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం జరిగింది అని అన్నారు, సాగు దారులకు భూములు పై హక్కు డిమాండ్ ను జాతీయ డిమాండ్ గా మార్చింది అని అన్నారు ప్రపంచ ఖ్యాతిని పోందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, బెంగాల్ తెబాగ రైతాంగ పోరాటం, కేరళ ఉన్నప్ప వాయిలార్ రైతాంగ పోరాటం, మహారాష్ట్ర వర్లి ఆదివాసీ గిరిజన రైతాంగ పోరాటాల్లో అఖిల భారత కిసాన్ సభ భాగస్వామి అన్నారు, ప్రస్తుత దేశం లో కార్పొరేట్ వ్యవసాయం కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం లో అఖిల భారత కిసాన్ సభ ముఖ్య భాగస్వామి అని కార్పొరేట్ వ్యతిరేక పోరాట దినోత్సవం గా కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా రైతులు నిర్వహించాలి కోరారు ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కర్ రావు, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ, చింతనిప్పు చలపతిరావు, ఊరిడి సుదర్శన్ రెడ్డి తుళ్ళూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు