Dr. BR Ambedkar death programs

భారత్ న్యూస్ హైదరాబాద్,

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ హైదరాబాద్ లో… వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.