TPCC Vice President Niranjan’s comments on BJP State President and Union Minister Kishan Reddy

భారత్ న్యూస్ హైదరాబాద్,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

నిరంజన్ కే మతిస్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతోంది

కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేపో మాపో తెలంగాణలో కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉంది

ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే… రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు వేస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఒక్క రూపాయి తక్కువ వేసినా… ఒప్పుకునేది లేదు

ఆచరణకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు, ముందుంది ముసళ్ళ పండుగ

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు

అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ‘హస్తం’ కనుమరుగైంది

రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా అగ్రనేతలు కాళ్ళకి బలపం కట్టుకున్నట్టుగా ప్రచారం చేసినా… ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీకే పట్టం కట్టారు

ఈ ఫలితాల దెబ్బకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక కాంగ్రెస్ నేతలు దిక్కులు చూస్తున్న పరిస్థితి

తెలంగాణలో కూడా తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం మీది

ఇల్లు అలకగానే పండగ కాదు… మీకు ముందుంది అసలైన పండుగ

ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే… ప్రజలే బండకేసి కొడతారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలనే సాధించింది

మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా…. 14% ఓట్లను సాధించుకున్నాం

వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో… ప్రజలు భారతీయ జనతా పార్టీకే జై కొట్టారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం

  • ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హైదరాబాద్.
    12-12-2023