మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్స్ లో జరిగిన సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కామెంట్స్…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి…
రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా..?
ఒక్క పరీక్ష నిర్వహించారా…
మా హయాంలో ఉద్యోగాలు వొస్తే మీరుగా చెప్పుకుంటారా
దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా…
తెలంగాణ వొద్దు అంటూ గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్
అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరం..
సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు ఎత్తు కెళ్లారు
150 కోట్ల నిధులు రద్దు చేశారు
సిద్దిపేట అభివృద్ధి ని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ లకు బుద్ది చెప్పాలి..
18 గంటలు మీకోసం పనిచేశా..మీ కుటుంబ సభ్యుడిగా పనిచేశా..
కొన ఊపిరి ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తా..
సిద్దిపేట అభివృద్ధి శ్వాస గా పనిచేస్తా
నేటి యువతే భవిష్యత్ వారసులు
కాబోయే ప్రజాప్రతినిధులు, అధికారులు మీరే కావాలి
మిమ్మల్ని కంటి రెప్పలా చూసుకుంటాం
సోషల్ మీడియాలో కొత్త పుంతలు తొక్కేలా పనిచేయండి
స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే..పరిష్కరించుకుందాం
అవార్డుల ఖిల్లా సిద్దిపేట నెంబర్ 1
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వొచ్చేనా…
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారు..
ఎంతో మంది త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్ర సాకారం
రేవంత్ అమర వీరులకు నివాళి అర్పించారా..?
మీరే నా బలం..నా బలగం
మాజీ కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి మీకు సుపరిచితమే..
యువత పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలి
సిద్దిపేట లో ఖ్యాతి గాంచిన వెంకట్రామరెడ్డి కి పార్లమెంటు కు ఎంపీ గా ఎన్నికయ్యేలా చూడాలి
హమాలీ కార్మికుడి బిడ్డలు mbbs సీట్లు వొస్తే..వారికి అండగా నిలిచారు..
అనాధలు రాధా రాధికలకు అండగా ఉన్నారు…
వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు రాత్రి పగలు పనిచేశారు..
బద్ది పడగలో అనాధ పిల్లలకు అండగా నిలిచి తలా లక్ష అందించారు…
6 గ్యారంటీ లు ఏమాయే…
100 రోజులు గడిచినా.. రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మీపించిన్, స్కూటీ పథకం రానోళ్లు, 4 వేల పించిన్ అందుకోనోళ్లు..వరి బోనస్ రానోళ్లు ఎక్కడికక్కడ నిలదీయాలి…
ఫిబ్రవరి పించిన్ ఎగ్గొట్టినారు..
దేవుడు అందరి వాడు…సిద్దిపేట లో ఎన్నోదేవాలయాలు నిర్మించాము
సిద్దిపేట జిల్లా, సిద్దిపేట కు రైలు, సిద్దిపేట కు గోదావరి జలాలు వొచ్చాయి అంటే కేసీఆర్ తో జరిగింది
బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ మోసం..
డీజిల్, పెట్రోల్ , గ్యాస్ ధరలు పెంచి ఆగం చేశాడు నిరుద్యోగం పెంచాడు…
ఎడ్లు బండి, నిరుద్యోగ భృతి లాంటి మాయ మాటలు రఘునందన్ ను దుబ్బాకలో చిత్తుగా ఓడించారు
జిల్లాలు రద్దు చేస్తానంటున్న రేవంత్ కు ఓట్లు రద్దు చేయాలి

మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి కామెంట్స్…
సైనికుల్లా ముందుకు సాగుతున్నారు ..
నాగెలుపులో యువత కీలక పాత్ర పోషించాలి
ఒక కలెక్టర్ ఎంపీ అవుతున్నాడు అంటే మనకు గర్వకారణం
కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చారు..ఎంపీ గా గెలిపించాలి..
ఐ ఏ ఎస్ అధికారిగా ఇక్కడే పనిచేసిన ఘనత నాకే దక్కింది
కేసీఆర్, హరీశ్ రావు గార్ల సహకారంతో సిద్దిపేట జిల్లాను దేశంలోనే ఆదర్శం గా తీర్చిదిద్దాం
నేను ర్యాంక్ సాధించినప్పుడు తెలంగాణ ఒక తరం వెనుకబాటులో ఉంది..
అత్యధిక కాలం ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత నాకు దక్కింది
ఉద్యోగ అవకాశం వొస్తే అది భగవంతుడు ఇచ్చిన అవకాశం గా భావించి నా దగ్గరికి వచ్చిన వారిలో నా కుటుంబ సబ్యున్ని చూసుకున్నా
నా పని తీరు నచ్చే సుదీర్ఘ కాలం పనిచేసేలా చేసింది..
ఎక్కడైతే కలెక్టర్ గా ఖ్యాతి గాంచిన చోట నే ప్రజా సేవలో ఎంపీ అభ్యర్థి గా అవకాశం రావడం సంతోషం
కలెక్టర్ గా పనిచేసేటప్పుడు నా దగ్గర పనిచేసే బాబు కు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు
నాకు ఫోన్ లో సమాచారం వొస్తే..నేను తల్లడిల్లి యశోదాకు పోయి మెరుగైన వైద్యం అందించాలని, బాగైతే బాబు తో కలిసి తిరుపతి వెంకన్నకు తల నీలాలు సమర్పిస్తామని మొక్కాను
రూ 58 లక్షలు వెచ్చించి ఆరోగ్యం బాగు చేయించి, తిరుపతి కి వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నాం..
ఉట్టి మాటలు చెప్పడం లేదు..గట్టిగా పనిచేస్తా
మీకోసమే నా ఆరాటం
మీరు బాగు పడాలన్నదే నా తపన
యువత తలుచు కుంటే ఏదైనా సాధ్యమే
కలెక్టర్ గా పనిచేశా..మీబాగు కోసం కృషి చేస్తా
యువతకు దశ, దిశా నవుతా
యువతరానికి చుక్కాని అవుతా…
నిరుపేదల చదువు కష్టాలు కళ్లారా చూశా…
మీలాంటి యువకుల కోసమే 100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నా
మీ అందరికి సుశిక్షులైన అధ్యాపకులతో ఉచిత కోచింగ్ ఇప్పిస్తా
వృత్తి నైపుణ్య శిక్షణ…