భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరీమణులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే, భువనగరి పార్లమెంట్ ఇంచార్జ్ ,శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు

ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు ,భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ..

యువకుడు అంచలంచలుగా ఎదిగి గత 15 సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా NSUI యూత్ కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న, యువకుడు పోరాట శీలి నిత్య కృషివలుడు మృదుస్వభావి , తను చేసిన సేవ కార్యక్రమాలను చూసి అధిష్టానం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తున్నాను, ఈరోజు యువకునికి టికెట్ ఇచ్చింది, మనఅందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చాము పేదలకు న్యాయం చేయాలి అనే లక్ష్యంతో 6 గ్యారెంటీ ల స్కీంతో పేదల కోసం రైతుల కోసం యువకుల కోసం మహిళల కోసం స్కీములు విడతలవారీగా అమలు చేస్తూ వస్తుంది, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువకుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మి అందర్నీ అభ్యర్థిస్తున్నాను, నా అభిమానులందరికీ భువనగరి పార్లమెంట్ ప్రజానీకానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని కోరుతున్న..

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

ఒక సామాన్యుడు అయినటువంటి నేను యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఒక కార్యకర్తగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ,అలాగే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో మిగతా ఎమ్మెల్యేలు అందరి ఆశీర్వాదంతో ఈ నిర్ణయం తీసుకుంది,
మున్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బూతు స్థాయి నుండి కార్యకర్తల నాయకులు వరకు పనిచేసే అత్యధిక మెజార్టీతో గెలిపించారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన్ని తరిమి కొట్టడం జరిగింది..
రెండు లక్షల 50 వేల మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది మళ్లీ ఒక్కోసారి పార్లమెంట్ ఎన్నికలలో అదే ఉత్సాహంతో అదే విధానాలతో పనిచేసి
తెలంగాణ లోనే అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిపించుకొని ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఉంది.
సోనియా గాంధీ గారు 2014లో తెలంగాణ రాష్ట్రనీ ఇచ్చారు ఏదైతే బంగారు తెలంగాణ నీళ్లు, నిధులు ,నియామకాలు తెచ్చుకున్నాము,కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లు తుంగలో తొక్కింది, ఈ 100 రోజుల్లో మన ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ,మంత్రులు ,ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇచ్చిన గ్యారెంటీలను వీలైనంతవరకు అమలు చేస్తున్నారు, కొని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి, ఈ వంద రోజుల్లో ఏదో కరువు వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు అని, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఇక్కడున్న శాసనసభ్యులు ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో మేమందరం పనిచేస్తుంది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కల నెరవేర్చాలి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి ,భువనగిరి పార్లమెంట్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుతున్న అని అన్నారు..