భారత్ న్యూస్ అనంతపురం..సీనియర్లకు ప్రాధాన్యత ఎక్కడ? టీడీపీ రాజ్యసభ ఎంపికలపై రాజకీయ దుమారం!
ఆంధ్రప్రదేశ్ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ వంటి పేర్లు తెరపైకి రావడం… దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, వాయిస్ వినిపిస్తున్న సీనియర్ దళిత నేత వర్ల రామయ్యకు మరోసారి నిరాశే ఎదురవడం తీవ్ర చర్చకు దారితీసింది.
సామాజిక న్యాయం – నినాదమా? నిబద్ధతా?
ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం… అత్యున్నత సభ అయిన రాజ్యసభకు ఎస్సీ సామాజికవర్గం నుండి ఎవరినీ ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్యకర్తల ఆవేదన: పార్టీ కోసం అన్ని కాలాల్లోనూ అండగా నిలబడి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా గళం వినిపించిన వర్ల రామయ్య లాంటి సీనియర్లకే గుర్తింపు లేకపోతే, సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

వర్ల రామయ్య వంటి సీనియర్ నేతలకు ఏది ఏమైనప్పటికీ, ఓట్ల రాజకీయం ముగిసిన తర్వాత పదవుల పంపకాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతింటే అది పార్టీ క్యాడర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దళితుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీలోనైనా ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తుందో చూడాలి