రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!

భారత్ న్యూస్ హైదరాబాద్…రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!

రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై చాలామందికి అవగాహన లోపిస్తోంది.

ఐదేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు, కానీ ప్రత్యేక బెర్త్ లభించదు.

5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు సగం టికెట్ వర్తిస్తుంది, అయితే ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ తీసుకోవాలి.

12 ఏళ్లు పైబడిన వారికి పూర్తి టికెట్ తప్పనిసరి… ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు పిల్లల వయస్సును సరిగ్గా నమోదు చేయకపోతే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంది.

ప్రయాణంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మీ ఆధార్ వెంట తీసుకెళ్లడం మంచిది…