భారత్ న్యూస్ విజయవాడ…నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు.
పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు వర్షాలు, పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు….