రేపు మృగశిర కార్తె – చేప మందు పంపిణీ:-

భారత్ న్యూస్ హైదరాబాద్…రేపు మృగశిర కార్తె – చేప మందు పంపిణీ:-

రేపు జూన్ 8, 2026 సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ మొదలవుతుంది
జూన్ 9 మంగళవారం రాత్రి వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు జరుగుతుంది

హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్

బతిని గౌడ్ కుటుంబం 176 ఏళ్లుగా ఉచితంగా ఇస్తున్న సంప్రదాయం. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లకు బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో పసుపు మూలిక పేస్ట్ పెట్టి మింగిస్తారు. శాఖాహారులకు బెల్లంతో ప్రసాదం ఇస్తారు

తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధం చేశారు. క్యూలైన్ల దగ్గర ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు అన్నీ ఉన్నాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఏర్పాట్లు పరిశీలించారు

మందు తీసుకున్నాక 45 రోజుల పాటు కఠిన డైట్ ఫాలో అవ్వాలి. ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెల్లో మందు బిళ్లలు కూడా వేసుకోవాలి

దేశం నలుమూల నుంచి లక్షల మంది వస్తున్నారు కాబట్టి తెల్లవారుజామునే వెళ్తే క్యూ తక్కువగా ఉంటుంది…