రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం!

విశాఖపట్నం :

విశాఖపట్నం కేజీహెచ్లో లంగ్ క్యాన్సర్ రోగులకు అత్యంత ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రకటించారు. 18 నుండి 65 ఏళ్ల వయసు వారికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఏడాదిపాటు ఒక్కో సైకిల్కు రూ.4 లక్షల విలువైన మందును ప్రతి 3 వారాలకు ఒకసారి చొప్పున మొత్తం 17 సార్లు ఉచితంగా అందిస్తారు. అంటే రూ.68 లక్షల విలువైన చికిత్స ఫ్రీగా అందనుంది.