భారత్ న్యూస్ వరంగల్ …అవయవదానంపై అవగాహన పెంచాలి: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ : ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని హయత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అవయవదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రుల సీఈవో తేజస్వి రావు కూడా పాల్గొన్నారు. అవయవదానం అనేది ఒక వ్యక్తి అందించగలిగే గొప్ప బహుమతి అని, అవయవాల అవసరానికి, లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.