సమాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారు

భారత్ న్యూస్ ఖమ్మం…..సమాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారు

మార్చురీలో భద్రపరిచే మహిళా మృతదేహాల దుస్తులు తొలగించి వారి ఫొటోలను చిత్రీకరిస్తూ పట్టుబడిన మునీర్ అహ్మద్.

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మార్చురీలో అటెండెంట్‌గా మునీర్ అహ్మద్ చాలా కాలంగా పని చేస్తున్నాడు.

పోస్ట్‌మార్టం సమయంలో ఎలాంటి చట్టపరమైన అనుమతి, అవసరం లేకుండానే మహిళల మృతదేహాలపై ఉన్న దుస్తులు తొలగించి నగ్న ఫొటోలను తీసేవాడు. దీనిని గమనించిన ఓ డాక్టర్ అతడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా ఇలాంటి పలు ఫొటోలు కనిపించాయి. ఇది తెలుసుకుని డాక్టర్లు, వైద్య సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

డాక్టర్ల ఫిర్యాదుతో మునీర్ అహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చనిపోయిన మహిళలను కూడా వదలని ఇలాంటి సైకోలను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.