భారత్ న్యూస్ విశాఖపట్నం..రాజ్యసభ అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కనపర్తి శ్రీనివాసరావు
కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగమనేని రమేష్ లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. కూటమి తరఫున అత్యున్నత సభకు ఎంపికైనందుకు గాను వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి అనుభవం, నాయకత్వం రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
