తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ పని చేస్తుందని

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్‌ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్‌ కన్వీనర్‌ గా బొల్లా శివశంకర్‌, కో ఆర్డినేటర్‌ గా ఆలకుంట హరి, అడ్వైజర్ గా గట్టు రామచందర్‌ రావు, మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు.