.భారత్ న్యూస్ హైదరాబాద్….పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్.. నెలకు ₹9,000 స్టైపెండ్!
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ చేపట్టింది. 18-25 ఏళ్ల మధ్య ఉండి, 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన వారు దీనికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు ₹9,000 స్టైపెండ్ తో పాటు, ఒకేసారి 76,000 జాయినింగ్ గ్రాంట్ లభిస్తుంది. 6 లేదా 9 నెలల పాటు ప్రముఖ కంపెనీల్లో పని అనుభవం పొందవచ్చు. ఆసక్తి గల వారు PMIS పోర్టల్లో వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
