భారత్ న్యూస్ హైదరాబాద్…వికారాబాద్ కోర్టులో పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన న్యాయమూర్తులు, ఎస్పీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులతో కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, ఎస్పీ స్నేహ మెహ్ర ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని న్యాయమూర్తి నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ జూనియర్ న్యాయమూర్తి శాంతి లత, అదనపు జూనియర్ న్యాయమూర్తి వైష్ణవి, అటవీశాఖ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు లవకుమార్, వసుందర, వెంకట్ రెడ్డి, చీఫ్ న్యాయవాది టి. వెంకటేష్, న్యాయవాదులు రాము, కమల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగరాజు, రాజు, రాజశేఖర్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
