భారత్ న్యూస్ హైదరాబాద్…కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ సింగరేణిలో రూ.1600 కోట్ల బొగ్గు కుంభకోణంపై వెంటనే విచారణ జరపాలి సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైంది? రూ.1600 కోట్ల విలువైన బొగ్గు ఏమైందో వెంటనే తేల్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిందని బీఆర్ఎస్ ఆరోపణ. బొగ్గు గనుల శాఖ, కాగ్ అధికారులు ఇప్పటివరకు తనిఖీలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్న. సింగరేణి బొగ్గు తెలంగాణ ప్రజల ఆస్తి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంస్థ మనుగడనే దెబ్బతీస్తున్నాయని విమర్శ. కిషన్ రెడ్డి వెంటనే విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, అఖిలపక్ష బృందాన్ని గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్.
