భారత్ న్యూస్ విజయవాడ…ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుంది
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
రూ.3.30లక్షలతో గురుకులంలో అనంత అరణ్య మొక్కల పెంపకం ప్రారంభించిన ఎమ్మెల్యే
మోపిదేవి: ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం మోపిదేవిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనంత అరణ్య మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. రూ.3.30లక్షలతో 15సెంట్ల స్థలంలో 915 ఔషధ, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను ఆరోగ్యవంతమైన, పచ్చని పాఠశాల ప్రాంగణాలుగా సృష్టించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇంచార్జి ఎంపీపీ నడకుదుటి జననీకుమారి, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, ఎంపీడీఓ జే.స్వర్ణభారతి, ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ పర్వీన్ సుల్తానా, ఎంఈఓలు శివశంకర్, జీ.ఎన్.బీ గోపాల్, ప్రిన్సిపాల్ వీరరవి, ఏపీఓ టీవీఎన్ ముత్యాలు, ఉపాధ్యాయులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
