మాయమవుతున్న గంగరాయి చెరువు.. పట్టించుకోని హైడ్రా

..భారత్ న్యూస్ హైదరాబాద్….మాయమవుతున్న గంగరాయి చెరువు.. పట్టించుకోని హైడ్రా

మన్నెగూడలోని గంగరాయి చెరువును మింగేస్తున్న అక్రమార్కులు

ఎఫ్టీఎల్ భూములను యథేచ్ఛగా మట్టితో పూడ్చేస్తున్నా పట్టించుకోని హైడ్రా అధికారులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధిలో 15.3 ఎకరాల విస్తీర్ణతలో ఉన్న గంగరాయి చెరువు

చెరువులోని 3.35 ఎకరాలను హైడ్రా ఎఫ్టీఎల్ భూములుగా నిర్ధారించినా, క్షేత్ర స్థాయిలో హద్దులు గుర్తించకపోవడమే అక్రమార్కులకు అదునుగా మారిందని ఆరోపిస్తున్న స్థానికులు

అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

చెరువును ఆక్రమించడం వల్ల పలు కాలనీలకు ప్రమాదమని, వెంటనే అధికారులు జోక్యం చేసుకొని పూడ్చివేతలను ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు….