ఉపాధి హామీ పథకంలో కొత్త చట్టం!జూలై 1 నుంచి అమలు

భారత్ న్యూస్ విజయవాడ…ఉపాధి హామీ పథకంలో కొత్త చట్టం!

జూలై 1 నుంచి అమలు!

కేంద్ర ప్రభుత్వం దేశ గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది దశాబ్దాలుగా అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిం ది, కొత్తగా తీసుకువ చ్చిన వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీ వికమిషన్‌ గ్రామీణ, వీబీ-జీరామ్‌ జీచట్టం- 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

ఈ చట్టం అమలు ఎలా, పనుల పర్య వేక్షణ బాధ్యత ఎవరిది, పథకానికి ఎవరు అర్హులు, పని దినాలెన్ని, వేతనాల చెల్లింపులు ఎలా, రాష్ట్ర ప్రభుత్వాల విధులేంటి.. అన్న అంశాలను అందులో పేర్కొంది.లబ్ధిదారులు ఉపాధి హామీ చట్టం నుంచి వీబీ-జీరామ్‌జీ చట్టానికి మారే ప్రక్రి యను వివరించింది.

ఈ చట్టం దేశవ్యాప్తం గా జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ముసా యిదా నిబంధనలపై అభ్యంతరాలుంటే జూన్‌ 21లోగా తెలియజేయాలని రాష్ట్రాలను, నిపుణుల ను, సంస్థలను, ప్రజా సంఘాలను కోరింది. ముసాయిదాలో పేర్కొన్న దాని ప్రకా రం.. వీబీ- జీరామ్‌జీ చట్టం అమలుకు కేంద్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు.

ఇందులో కేంద్రగ్రామీ ణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్‌ నుంచి ప్రతి నిధులు, కేంద్రమంత్రు లు, రాష్ట్రాల ప్రతినిధు లు సభ్యులుగా ఉంటా రు. ఇక, కేంద్రస్థాయి లోనే సెంట్రల్‌ గ్రామీణ్‌ రోజ్‌గార్‌ గ్యారంటీ కౌన్సిల్‌ పనులను పర్యవేక్షిస్తుంది. చట్టం అమలును చేస్తుంది,

ఈ చట్టంలో ఒక కూలీకి ఏడాదిలో కల్పించాల్సిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచారు. కూలీలు కోరిన 15రోజుల్లోగా పని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే, వారికి భృతిని చెల్లిం చాలి. పని కల్పించడం ఆలస్యమైన మొదటి 30రోజుల్లో.. రోజువారీ గా కనీసం పావు వంతు వేతనం చెల్లించాలి. తర్వాత కూడా పని కల్పించక పోతే సగం వేతనాన్ని చెల్లించాలని ముసా యిదా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీ చేసుకున్న వారందరినీ కొత్త చట్టం కింద గుర్తిస్తారు.