షాద్ నగర్ ఏసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న కాంగ్రెస్ నేతలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….షాద్ నగర్ ఏసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న కాంగ్రెస్ నేతలు

షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి ఎస్ లక్ష్మీనారాయణను స్థానిక కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సుమారు ఎసిపి కార్యాలయంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ సర్వర్ పాషా, సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం కలుసుకొని శాలువాతో ఏసిపి లక్ష్మీనారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా శాంతి పద్ధతుల పరిరక్షణకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలు పోలీసు శాఖకు ఎంతో సహకారం అందిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.. .