భారత్ న్యూస్ ఢిల్లీ…..రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన Supreme Court
రిజర్వేషన్ల భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉన్న వ్యాఖ్యలు
తరతరాలుగా అదే రిజర్వేషన్ కోటా కోరుకోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం
“తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే.. వారి పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ ఎందుకు?” అంటూ కోర్టు ప్రశ్న

క్రీమీలేయర్ పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ
రిజర్వేషన్ల ద్వారా సామాజిక, ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత కూడా కోటా కొనసాగడం సరైందా? అన్న ప్రశ్న
“ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం” అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్య
విద్య, ఆర్థిక సాధికారతతో కుటుంబాల పరిస్థితి మారుతుందని కోర్టు అభిప్రాయం
తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత పిల్లల పరిస్థితి కూడా మారుతుందని స్పష్టం
రిజర్వేషన్ల అమలులో సమతుల్యత అవసరమని కోర్టు సూచన
ఒకే కుటుంబాలు పదేపదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన
అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు అవకాశాలు అందడం లేదని వ్యాఖ్య
రిజర్వేషన్ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం
ప్రస్తుతం ఓబీసీలకు మాత్రమే ఉన్న క్రీమీలేయర్ నిబంధనలపై మళ్లీ చర్చ
క్రీమీలేయర్ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా అమలు చేయాలన్న దిశగా సుప్రీంకోర్టు పరిశీలన