భారత్ న్యూస్ ఢిల్లీ…..Indians: ఇరాన్ లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అక్కడ అదృశ్యమయ్యారు. వారు కిడ్నాప్ కు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు.
ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టాలని వారు ఎంబసీను కోరారు. దీనిపై ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించింది.
ముగ్గురు భారతీయులు జాడ తెలియకుండా పోయారని, వారు ఎక్కడున్నారో గుర్తించాలని, వారి భద్రతకోసం చర్యలు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేసింది.

ముగ్గురు యువకులు పంజాబ్ కు చెందినవారే.