శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

భారత్ న్యూస్ రాజమండ్రి….శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

చల్లపల్లి:
గుర్తుతెలియని ఆగంతకులు బస్ షెల్టర్ల శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటన పులిగడ్డ-విజయవాడ కరకట్టపై మండల పరిధిలోని నడకుదురు, రాముడుపాలెం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నడకుదురు పంచాయతీ పరిధిలోని నడకుదురు, రాముడుపాలెం వద్ద ప్రాంతాల వద్ద కరకట్టపై ఎంపీ నిధులతో ఒక్కొక్క దానికి ఐదు లక్షలు చొప్పున రెండు చోట్ల రెండు బస్ షెల్టర్లను 2023-24లో నిర్మించారు. పంచాయతీలో తీర్మానం చేసిన దగ్గర నుంచి వాటి నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్మాణ పనులు గాని వాటి పర్యవేక్షణ అన్ని గ్రామ సర్పంచ్ గొరిపర్తి సురేష్ ఆధ్వర్యంలో జరిగినట్లు చెబుతున్నారు. పంచాయతీలో తీర్మానం చేసి వర్క్స్ కమిటీని ఏర్పాటు చేసి ఆ వర్క్స్ కమిటీ ద్వారా బస్సు షెల్టర్లను నిర్మించారు. కొంతకాలం క్రితం గ్రామ పెద్దలతో కలిసి ఆ బస్సు షెల్టర్ లను నడకుదురు సర్పంచ్ అయిన గొరిపర్తి సురేష్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. కరకట్ట మీదుగా విజయవాడ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాముడు పాలెం నడకుదురు వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను ఉపయోగించుకుంటున్నారు. అయితే బుధవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు వచ్చి రెండు బస్ షెల్టర్ శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ గొరిపర్తి సురేష్ శిలాఫలకాలను పగలగొట్టిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, మునుముందు ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.