సైన్యం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..సైన్యం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

సైన్యానికి ఆయుధాల కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా సైన్యానికి అధికారాలు అప్పగించింది.

సర్వైలెన్స్ డ్రోన్స్, కమికేజ్ డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్, మిస్సైల్స్, రాకెట్స్ వంటి రూ.40 వేల కోట్ల విలువైన ఆయుధాలను త్వరలోనే సైన్యం కొనుగోలు చేయనుంది.