28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

భారత్ న్యూస్ హైదరాబాద్ …28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.

ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31 లక్షల మందికిపైగా సిబ్బందిని సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.