భారత్ న్యూస్ గుంటూరు…పేషంట్కు ‘OG’ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ…
పవన్ వీరాభిమాని అయిన మహిళకు ‘OG’ చూపిస్తూ డాక్టర్లు ఆపరేషన్ చేశారు.
గుంటూరు(D) వడ్లమూడిలోని ఆస్పత్రిలో కోటేశ్వరమ్మ(45)కు నిన్న బ్రెయిన్ సర్జరీ జరిగింది.
శరీర కదలికలు, మెదడు పనితీరును నియంత్రించే ప్రాంతానికి దగ్గర్లోనే ట్యూమర్ను గుర్తించారు.
నాడీ వ్యవస్థకు హానీ కలగకుండా రోగిని మెలకువలోనే ఉంచి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.
అందుకే మూవీ చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ ట్యూమర్ తొలగించారు…

AndhraPradesh