విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు

భారత్ న్యూస్ అనంతపురం .. …విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు

రెండో విడత ప్రవేశాల ఫలితాలు 14న విడుదల.

ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించి నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివా సరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను విద్యాహక్కు చట్టం కింద భర్తీ చేస్తున్నారు. మొదటివిడతలో 23,117 మందికి సీట్లు కేటాయించగా.. ఈ నెల 7లోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. 7న బక్రీద్, 8న ఆదివారం సెలవుల కారణంగా గడువును 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. రెండో విడత ఆర్టీఈ ప్రవేశాల ఫలితాలను జూన్ 14న విడుదల చేసి, సీట్లు పొందినవారు 21లోపు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.