భారత్ న్యూస్ తిరుపతి…హనుమాన్ జయంతి 🚩
మంగళవారం గ్రహబలం పంచాంగం
మంగళవారం గ్రహాధిపతి “కుజుడు” మరియు “కేతువు”.
కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం భౌమాయ నమః ll
- ఓం శరవణభవాయ నమః ||
- ఓం రుద్రాయ నమః ||
కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించండి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి.
కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విగ్నేశ్వరుడు మరియు నాగ (సర్ప) దేవతలు. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం కేతవే నమః ||
- ఓం సర్పేభ్యో నమః ||
- ఓం గం గణపతయే నమః ||
- ఓం రుద్రాయ నమః ||
కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతు కాలం/యమగండ కాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) దర్శించండి. గణపతి స్తోత్రాలను, పఠించండి.
మంగళవారం లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
గ్రహ బలం కొరకు, మంగళవారం ఎరుపు, మెరూన్ మరియు గోధుమ (బ్రౌన్) రంగు దుస్తులు ధరించండి. మంగళవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అకారణంగా గొడవలు పెరుగుతుంది. అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు.
అమృత కాలం:
05:20 PM – 06:55 PM
దుర్ముహూర్తం:
08:27 AM – 09:20 AM, 11:17 PM – 12:01 AM
వర్జ్యం:
07:49 AM – 09:24 AM
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం,
తిథి:
దశమి: May 11 03:24 PM to May 12 02:52 PM
ఏకాదశి: May 12 02:52 PM to May 13 01:30 PM
దశమి ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణ తిథి. దశమి పుణ్య కార్యాలు, భక్తి కార్యాలు, గృహ ప్రవేశం, ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడం, వివాహా ప్రయత్నాలు, ఆభరణాలు ధరించడం, ప్రయాణాలు, మరియు ముఖ్యమైన వ్యక్తులను కలవడం వంటి పనులకు అనుకూలమైన తిథి.
దశమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, యమధర్మరాజును ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నక్షత్రం:
పూర్వభాద్రపద: May 12 01:28 AM to May 13 01:17 AM
ఉత్తరాభాద్రపద: May 13 01:17 AM to May 14 12:17 AM
పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి “బృహస్పతి”. అధిష్టాన దేవత “అజైకపాద”. ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం.
పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం బృహస్పతయే నమః ||
- ఓం అజైకపాదే నమః ||
పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నరోజు – పోరాటాలు, చెడు, మోసం, సంఘర్షణ, శత్రువుల నాశనము, నిర్బంధం, విష ప్రయోగం, నిప్పు పెట్టడం, విధ్వంసం, అపఖ్యాతి మరియు క్రూరత్వం వంటి చర్యలకు అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలకు అనుకూలం కాదు.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.
చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు ||
శుభం భూయాత్ ||