రాత్రి జేసీబీలతో వారాహి అమ్మవారి గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి చెరువులో వేయించారు

భారత్ న్యూస్ తిరుపతి.

తిరుపతి జిల్లా తిరుచానూరులో దారుణం చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి జేసీబీలతో వారాహి అమ్మవారి గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి చెరువులో వేయించారు. ఈ అమానుష ఘటనపై భజరంగదళ్ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు వెళ్లగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు..