బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

భారత్ న్యూస్ అనంతపురం .. …బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష

శాసనభలో బిల్లు ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం, ఆమోదించిన గవర్నర్

ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన తమిళనాడు ప్రభుత్వం

రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని పేర్కొన్న స్టాలిన్ ప్రభుత్వం