భారత్ న్యూస్ తిరుపతి….ఏపీలో శాంతిభద్రతలు దిగజారాయి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి
కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టిడిపి నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గూర్చి అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణితో కలిసి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ని కోరినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, సాక్షి జర్నలిస్ట్ లపై పోలీసు వ్యవస్థని కేంద్రీకరించడం వలన నిఘా కొరవడి రాష్ట్రంలో అరాచకాశక్తులు పెట్రేగి పోయారని మహిళల పై, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల సత్యసాయి, ఆనంతపురం జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గూర్చి ప్రస్థావిస్తూ కూటమి అరాచకాలను ఎండగట్టారు. ఈ ఘటనల గూర్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంతక మునుపు ఫిర్యాదు అయిన హరికృష్ణ పై దాడి పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి రెండు వారాలలో నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు.
