: ఆక్రమణల పర్వం యోగిమల్లవరం,పుణ్య క్షేత్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం,__ మహిళా శక్తికి అండగా కార్యక్రమంలో పూలివర్తి సుధారెడ్డి

భారత్ న్యూస్ గుడివాడ..

: ఆక్రమణల పర్వం యోగిమల్లవరం

పుణ్య క్షేత్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

చివరకు స్మశాన వాటికలు కూడా అధికార పార్టీ నేతల ఆక్రమణ…

__ మహిళా శక్తికి అండగా కార్యక్రమంలో పూలివర్తి సుధారెడ్డి

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు పంచాయితీ, యోగిమల్లవరంలో చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములు చివరకు స్మశాన వాటికలు కూడా అధికార పార్టీ నేతల ఆక్రమణకు గురవుతున్నాయని చంద్రగిరి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. ఆదివారం మహిళా శక్తికి అండగా కార్యక్రమంలో భాగంగా ఆమె యోగిమల్లవరం మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి సుధారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
తిరుచానూరు సర్పంచ్ గా రామచంద్రారెడ్డి ఎన్నిక తర్వాత యోగిమల్లవరంలోని ప్రముఖ శివాలయం కమిటీలో స్థానికులకు చోటు కల్పించకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని మహిళలు పులివర్తి సుధారెడ్డికి తెలిపారు. స్మశాన వాటికను కబ్జా నుండి కాపాడి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే అండతో కర్మ క్రియలు స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని కాపాడాలని, రోడ్లు, పైపులైన్లు, వీధి దీపాలు, పబ్లిక్ కొళాయిలు, లైబ్రరీ సమస్య, ప్రాథమిక వైద్యశాల నిర్మించాలని, ధోబి గాట్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. వర్షపు నీరు గ్రామంలోకి రాకుండా శాశ్వతంగా నివారించాలని తెలిపారు. యోగిమల్లవరం లెక్క దాఖలు సర్వే నెంబర్ 1/1,1/2 పొన్న కాల్వ మండపం దగ్గర చెరువు కాలువను పూర్తిగా ఆక్రమించడం కారణంగా బోరు నీరు డ్రైనేజీ నీరు కలిసిపోయి త్రాగునీరు ఇబ్బందికరంగా మారిందన్నారు. అన్ని సమస్యలకు నా భర్త పులివర్తి నాని పరిష్కారం చూపుతారని పు