ప్రజల ఆస్తిపై జగన్ కన్ను- గోపు సత్యనారాయణ,,

భారత్ న్యూస్ గుడివాడ,,

ప్రజల ఆస్తిపై జగన్ కన్ను- గోపు సత్యనారాయణ

నూతనంగా విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ప్రజల ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి కన్ను వేషాడంటూ మచిలీపట్నం పార్లమెంటరీ కార్యాలయం నందు కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ నిర్వహించిన పత్రికల సమావేశంలో ఆయన అన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటుచూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయి తప్ప ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని పంట కొనుగోలు సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పూర్తిగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.. అదేవిధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం వలన రాష్ట్రంలోని ప్రజలకు ఒక గుదిబండ లాగా ఉందని అన్నారు. ఈ జీవో ప్రకారం ఒక భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకొని దాని యొక్క నకలు ఆ భూమి యజమానినికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇదేగాని జరిగితే రాష్ట్రంలోనే ప్రతి ప్రతి ఒక్కరూ నష్టపోతారని తెలియజేశారు. తన సొంత ఆస్తి పై యజమానికి హక్కు లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ విధానం పూర్తిగా ప్రజల ఆస్తిపై ప్రభుత్వం గుప్పెట్లో ఉంటుందని తెలియజేశారు. ఈ జీవో వలన ఎక్కువగా రైతులు నష్టపోతున్నారని ఇప్పటికే తమ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందుకని రానున్న రోజులో రైతు రాజులగా బతకాలంటే ఈ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు వెంట ఉండాలని ప్రతి ఒక్క రైతుని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జిల్లా ఉపాధ్యక్షులు వేముల శివాజీ, జిల్లా కార్యనిర్వాహ కార్యదర్శి వీరంకి మునీశ్వర రావు,టౌన్ రైతు అధ్యక్షులు ఆళ్ల మాధవ్, టౌన్ కార్యదర్శి బడే రమణ, ఎర్రం శెట్టి నాని, గోపు నరేష్, సిహెచ్ నాగబాబు తదితర రైతు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..