ఉపాధి హామీ పనికి వెళ్లి ఎండ త్రివతకు వ్యవసాయకూలి రైతు మృతి..

భారత్ న్యూస్:
ఉపాధి హామీ పనికి వెళ్లి ఎండ త్రివతకు వ్యవసాయకూలి రైతు మృతి..

మృతిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దcన్న డిమాండ్.

కూడేరు ఏప్రిల్ 29( భారత్ న్యూస్) ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన బెల్డోన ఓబుళపతి అనే కూలీ సోమవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లి ఎండలు తీవ్రతఎక్కువగా ఉండడంతో అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాంతులు వీరేచనలతో ఇబ్బందులు పడుతుంటే అది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే కూడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని,అక్కడ చికిత్స పొందుతూ,ఉపాధి హామీ కూలి పనికి పోయి మరణించడం జరిగిందని, మృతి చెందిన బెలూన్ ఓబుల పతికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని,అతని మరణంతో కుటుంబంపెద్ద దిక్కును కోల్పోయిందని, దిక్కుతోచని పరిస్థితిలో భార్య మృతిని పిల్లలు ఉన్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని తక్షణ సాయం కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలలను అందజేయాలని
వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు చోళసముద్రం శ్రీరాములు,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాలు ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..