జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు,

జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారులకు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, చేపట్టవలసిన భద్రతా చర్యల గురించి వివరించిన ప్రొబేషనరీ డి.ఎస్పీ శ్రీ పావన్ కుమార్ గారు

చిత్తూరు( భారత్ న్యూస్ )2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు తీసుకోవలసిన చర్యలను గురించి గురువారం జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాకు వచ్చిన 8 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆదేశానుసారం ప్రొబేషనరీ డి.ఎస్పీ శ్రీ పావన్ కుమార్ గారు వివరించారు.

ఎన్నికల సమయంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా సాగేలా అనుసరించాల్సిన భద్రతా మరియు బందోబస్త్ విధానాలు గురించి, కేంద్ర సాయుధ పోలీసు బలగాల అవసరం, మోహరింపు, ప్లాగ్ మార్చ్ నిర్వహణ, ఓటర్లులను ప్రలోభాలకు గురిచేసే అక్రమ మద్యం, డబ్బులు మరియు ఇతర వస్తువులు కట్టడి, వాహనాల తనిఖీ, సెర్చ్ & సీజర్‌లు, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రత సంబంధిత అంశాల గురించి డి.ఎస్పీ గారు ట్రైనీ ఐపీఎస్‌ లకు వివరించారు.