అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా హాస్పిటల్ నందున్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి అగ్ని ప్రమాదాల

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా హాస్పిటల్ నందున్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం

పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణం యందు గల రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆరోవరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా హాస్పిటల్ నందున్న డాక్టర్స్ కు మరియు సిబ్బందికి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రతల గురించి అవగాహన కల్పించి సిబ్బందిచే మాక్ డ్రిల్ నిర్వహించి రెస్క్యూ పద్దతులు చేసి చూపించి కరపత్రములు పంచడమైనది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్ డాక్టర్స్ :
రామ్మోహన్ A. అరవింద్ కుమార్ , పాల్గొన్న నర్స్ లు లావణ్య జ్యోతి మనోహరి స్వప్న పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది: K.విశ్వనాథం,S. మనోహర రెడ్డి,S. రాజేంద్ర బాబు
B నాగార్జున,C. శ్రీనివాసులు