నాగాయలంక మండలంలో బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం.

భారత్ న్యూస్ నాగాయలంక

నాగాయలంక మండలంలో బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం..

ప్రభుత్వ తప్పిదాలను, వైసీపీ అరాచకాలను, వైఫల్యాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతూ రానున్న రోజులలో కూటమి ప్రభుత్వం అవసరం ఎంత ఉందో ప్రజలకు తెలియచేస్తూ నాగాయలంక మండలంలో బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అశేష జనవాహిని మధ్య భావదేవరపల్లి నుండి మోటారు సైకిళ్ళతో ర్యాలీగా సాగిన ఎన్నికల ప్రచారం కమ్మనమోల, సంగమేశ్వరం, పాత ఉపకాలి, చోడవరం, నంగేగడ్డ మీదుగా మర్రిపాలెం వరకు బుద్ధప్రసాద్ ప్రచారం సాగింది.

అదిగో మండలి బుద్ధప్రసాద్ అనే పాట యువతను, పార్టీ కార్యకర్తలను మరింత ఉత్సాహపరిచింది. నియోజకవర్గంలో వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ, బుద్ధప్రసాద్ చేసిన అభివృద్ధి పనులను, రాబోయే కాలంలో చేయబోయే పనులను పాటల రూపంలో వివరిస్తూ సాగిన ర్యాలీ ఆద్యంతం కార్యకర్తలకు, ప్రజలకు మరింత ఉత్సాహం రేకెత్తించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుద్ధప్రసాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కనుమరుగై పోయిందని అన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు వేసి పుణ్యం కట్టుకోలేదని విమర్శించారు. ఈ గ్రామానికి వెళ్లినా, తెలుగుదేశం హయాంలో తాము నిర్మించిన రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయని, త్రాగునీటికి ప్రజలు పడుతున్న బాధలు కనిపిస్తున్నాయని, సాగునీరు సక్రమంగా రాక రైతాంగం పడుతున్న అవస్థలు కనిపిస్తున్నాయని అన్నారు..

రాబోయే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరు, ప్రతి వ్యక్తికి పని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.

సంగమేశ్వరం గ్రామంలో మత్సకారులను, ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచిందని అన్నారు. మద్దతు ధరను సైతం ఇవ్వకుండా, ఇవ్వాల్సిన రాయితీలను కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటుగా ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీలలో సబ్సిడీ కల్పిస్తామని అన్నారు. టీడీపీ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.1.50 కి ఇస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.6 కి చేసారని, దీనివలన ఆక్వా రైతులు విద్యుత్ చార్జీలు కట్టలేక పంట వేయడం ఆపివేశరని అన్నారు. మత్సకారుల, ఆక్వా రైతుల సమస్యలు అన్నీ తీరి మత్సరంగం, ఆక్వా రంగం ఉజ్వల స్థితికి చేరాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని బుద్ధప్రసాద్ కోరారు.

రానున్న ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గా తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.