ఏప్రిల్ నెల పింఛన్లు మే 1వ తేదీనే పింఛనుదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ,,

భారత్ న్యూస్ గుడివాడ……

ఏప్రిల్ నెల పింఛన్లు మే 1వ తేదీనే పింఛనుదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ

బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ

పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, ఏప్రిల్ 28

జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ స్థానిక క్యాంప్ కార్యాలయం (కలెక్టర్ బంగ్లా) నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర 16 రకాల పింఛనుదారులు జిల్లాలో మొత్తం 2,43,400 లక్షల మందికి ₹ 71.75 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో పింఛన్దారులలో 75% మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వారికి పింఛన్లు మే ఒకటో తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు.

బ్యాంక్ ఖాతాలు లేని వారితోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, బెడ్ రీడెన్ వారికి వారి ఇళ్ల వద్దనే మే 1 నుండి 5 తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కావున పించన్దారులు ఎవ్వరూ పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు రానవసరం లేదని కలెక్టర్ తెలిపారు.

ఇదేవిధంగా మే నెల పింఛన్లు కూడా జూన్ 1 వ తేదీనే పింఛన్దారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు

డి ఆర్ డి ఎ పిడి పి ఎస్ ఆర్ ప్రసాద్, డిపిఓ నాగేశ్వర నాయక్, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, ఎల్ డి ఎం జయవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు


జిల్లా సమాచార పౌర సంబంధాధికారి కృష్ణ మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది