సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు ౼ జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు,IPS.

భారత్ న్యూస్ గుడివాడ..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు ౼ జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు,IPS.

ఎన్నికల సమయంలో అక్రమ రవాణాను అరికట్టడమే ద్యేయంగా రాత్రి వేళ్ళలో కూడా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమే కాకుండా, మద్యం, నగదు, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి అవకాశం వున్న ఇతర వస్తువులు అక్రమ రవాణాను అరికట్టడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మద్యం, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి వాహన తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని, దీనికోసం సాయుధ బలగాలను కూడా వినియోగిస్తున్నామన్నారు.