హైవే రోడ్డు పై బర్రెలు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరిది..?

భారత్ న్యూస్ గుంటూరు.Ammiraju Udaya Shankar.sharma News Editor…హైవే రోడ్డు పై బర్రెలు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరిది..?

పర్యవేక్షణ లేదా…!?

గస్తీ తిరిగే హైవే పెట్రోలింగ్ వాహనం ఏమైనట్లు సుమారు 3 కిలోమీటర్లు హైవే పై బర్రెలు

ఆ టెక్నాలజీ కళ్లుగప్పి యధేచ్చగా జాతీయ రహదారి పై బర్రెలు

చిలకలూరిపేట : హైవేల నిర్మాణంలో అత్యధిక ప్రాధానత్యనివ్వాల్సిన చర్యలలో ముఖ్యమైనది అత్యధిక వేగంతో వాహనాలు నడిచేటప్పుడు ఎటువంటి జీవాలు ,అంటే శునకాలు,మేకలు.ఆవులు , బర్రెలు,మేకలు రోడ్డు పైకి రాకుండా కనీసం సర్వీసు రోడ్డు కూడా ఎక్కకుండా ఫెన్సింగ్ తో రోడ్డు ప్రమాదాల నివారణకు
చర్యలు తీసుకున్నాం, 24 గంటలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కెమెరాల ఏర్పాటు హైవే పై గస్తీ ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ టెక్నాలజీ కళ్లుగప్పి బర్రెల గుంపు ఇటీవలే అత్యాధునిక హంగులతో సోలార్ వెలుగులు విరజిమ్ముతూ యడ్లపాడు నుండి ప్రకాశం జిల్లా అనంతవరం జాతీయ రహదారి వరకు ప్రత్యేకంగా నిర్మించిన బైపాస్ జాతీయ రహదారి పై పురుషోత్తమ పట్నం నుంచి నరసరావు పేట రోడ్డు వరకు హైవే రోడ్డుపై చల్ల గాలి కి తిరుగుతున్న బర్రెల గుంపు వల్ల వేగంగా వచ్చే వాహనాలకు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు..? అని అటుకుండ వెళ్ళుతున్న ప్రయాణికులు నోరెళ్ళ బెడుతున్నారు. అసలు గస్తీ తిరిగే హైవే పెట్రోలింగ్ వాహనం ఏమైనట్లు సుమారు 3 కిలోమీటర్లు హైవే పై బర్రెల గుంపు వాహనాలకు ఎదురుగా వెళుతున్నాయి. జాతియ రహదారిపై ప్రమాదాలు జరగకుండా తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..