తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ రాజమండ్రి….తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులకు గుడ్ న్యూస్

రెండు తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో బీర్ ధరలు భారీగా తగ్గనున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా బ్రిటన్ బీర్పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. 2022 జనవరి నుంచి 14 దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. అయితే, యూకే మేడ్ బీర్ల ధరల తగ్గింపుపై రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖాధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.