మోదుమూడి గ్రామంలో భారీగా మట్టీ అక్రమ రవాణా:

భారత్ న్యూస్ అనంతపురం .. …మోదుమూడి గ్రామంలో భారీగా మట్టీ అక్రమ రవాణా:

అవనిగడ్డ నియోజకవర్గంలోని మోదుమూడి గ్రామంలో జరుగుతున్న మట్టీ అక్రమ తవ్వకాలు:

పెద్ద సంఖ్యలో రవాణా జరుగుతుందని, తవ్వకాలు గ్రామ ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ఈ మట్టి తవ్వకాలు వైసీపీ పార్టీకి చెందిన నాయకులే చేస్తున్నారంటూ బురద చల్లే ప్రయత్నంగా ప్రచారం జరుగుతుందని, వాస్తవికంగా ఈ అక్రమాలకు మూల కారకులు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అనేది అందరికీ తెలిసిన విషయమేనని గౌతమ్ తెలిపారు..,

పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపులు జరుగుతున్నా పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు లేకుండా నిస్సహాయంగా పరిస్థితి కొనసాగుతుందని, బుద్ధ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు ఈ అక్రమాల్లో ప్రత్యక్షంగా లాభాల పొందుతున్నారని స్థానికంగా వినిపిస్తున్న వాదనలు బలంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయని గౌతమ్ అన్నారు..,

ప్రజలకు నష్టాలు, కష్టాలు కలిగించే ఈ రకమైన అక్రమ చర్యలను కూటమి పాలనలో సహించలేకపోతున్నామని .., వైసీపీ పార్టీని అపహాస్యం చేయడానికి కొందరు కావాలని వదంతులు వ్యాపింపజేస్తున్నా, వాస్తవాలు మాత్రం స్పష్టంగా బుద్ధ ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల పై వేలెత్తి చూపుతున్నాయని..,

అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సినవారే మట్టి మాఫియాకు వంతపాడుతున్నారని, పాలకుల మాట విని అధికారులు బలికావద్దని, తక్షణమే అక్రమ మట్టి తవ్వకాలు మరియు రవాణాని నివారించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ యువనేత గౌతమ్ డిమాండ్ చేశారు.