భారత్ న్యూస్ శ్రీకాకుళం….విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
ఇంధనం ధరలపై కొంతమేరకు ఉపశమనాన్ని కల్పించండి.
ప్రధాని మోదీజీ లూటిదారు.
దేశ ప్రజలను దోచడంలో మోడీ గారిని మించినోళ్లు లేరు.
పెట్రోల్,డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతి.
10 రోజుల్లో వరుసగా 4 సార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం.
రోజుకి వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ గారి ఆకలి తీరలేదు.

ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి,
దేశ ప్రజలకు బ్రతుకు భారం చేసే కుట్ర.
ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి,
అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోడీ గారికే చెల్లింది.
ఇంధనం ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని,
పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం,
రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారు.
నేడు నష్టాల పేరు చెప్పి మొత్తం భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీజీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం.
చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది,
ధరలు పెరిగాయని జనాలను వాయించడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు నిదర్శనం.
నాలుగవ సారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19 పైసలు.
డీజిల్ లీటర్ ధర రూ. 104.88 పైసలు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంధనపు ధరలు అధికం.
రాష్ట్ర ప్రజలపై మోడీ సర్కార్ భరించారని భారం మోపుతుంటే
చంద్రబాబు గారు మౌనం వహించడం సిగ్గుచేటు.
వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేకపోవడం బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్లీ డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలోనైనా అధికంగా వసూలు చేస్తున్న రూ. 4 వ్యాట్ ను , రూ. 1 రోడ్ సెస్ ను రద్దు చేయండి.