నాగర్‌కర్నూల్ అభివృద్ధిపై మంత్రి సీతక్కతో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భేటీ

భారత్ న్యూస్ వరంగల్ …నాగర్‌కర్నూల్ అభివృద్ధిపై మంత్రి సీతక్కతో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భేటీ

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతులు వేగవంతం కానున్నాయి…

పంచాయతీ రాజ్ శాఖ పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ

గ్రామీణ రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల కోరింపు

కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి

₹20.20 కోట్లతో సిర్సవాడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడి

సిర్సవాడ బ్రిడ్జ్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాలని మంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్‌లో నిర్మించిన మహిళా శక్తి భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం

ఎమ్మెల్యే విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క

రోడ్లు, భవనాల నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ
జూన్ 3న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన

సిర్సవాడ బ్రిడ్జ్ శంకుస్థాపన, మహిళా శక్తి భవన ప్రారంభోత్సవానికి అంగీకారం