భారత్ న్యూస్ విజయవాడ…ఎయిర్ సేఫ్టీపై ముగిసిన రామ్మోహన్‌నాయుడు సమీక్ష..
విమాన ప్రమాద మృతులకు రామ్మోహన్ నాయుడు సంతాపం..
విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురిచేసింది..
రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

AAIB డీజీ దర్యాప్తు ప్రారంభించారు.. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే వివరాలు తెలుస్తాయి.
హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశాం..
3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుంది. బోయింగ్ 787 భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం..
34 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయి.. ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగింది.
దర్యాప్తు వివరాలను త్వరలో వెల్లడిస్తాం.
– కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు.